మల్లారంలో గ్రామసభ

Gram Sabha in Mallaramనవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని మల్లారం గ్రామపంచాయతీ కార్యాలయం ఆవరణలో గురువారం గ్రామ ప్రత్యేక అధికారి అత్తే  సుధాకర్ గారి అధ్యక్షతన గ్రామసభ నిర్వహించడం జరిగిందని పంచాయతీ కార్యదర్శి చెలుకల రాజు తెలిపారు. ఈ సందర్భంగా స్పెషల్ అధికారి మాట్లాడారు వర్షాకాలం నేపథ్యంలో పారిశుద్ధ్య నిర్వహణ, అన్ని ప్రభుత్వ సంస్థల  సానిటేషన్ , డ్రైనేజీల పూడికతీత, దోమల మందు స్ప్రే చేయించడం, బ్లీచింగ్ పౌడర్ వేదజల్లించడం, నూతన విద్యుత్ బల్బుల ఫిట్టింగ్ చేయించడం, అదేవిధంగా తాడిచెర్ల గ్రామానికి చెందిన పందులను ఆగస్టు ఒకటో తారీకు లోపు సంబంధిత ఎరుకల కులస్తులు తీసుకొని వెళ్లాలని సూచించడం జరిగింది. గ్రామంలోని పశువులను గ్రామస్తులు రోడ్లమీద కట్టేయవద్దని సూచించారు. ప్రభుత్వ పాఠశాలలు,అంగన్ వాడు కేంద్రాల ఆవరణలో రాత్రి సమయాల్లో మద్యం సేవించడం అక్కడ ఉన్న ఫర్నిచర్ ను ధ్వంసం చేయడం చట్టరీత్యా నేరం కావున, ప్రభుత్వ ఆస్తులను కాపాడుకునే బాధ్యత గ్రామస్తులపైన ఉందన్నారు.  రాత్రి సమయంలో ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. ఇంటి పన్ను పన్ను సకాలంలో చెల్లించి గ్రామపంచాయతీకి అభివృద్ధికి తోడ్పడాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, అంగన్ వాడి టీచర్లు, వైద్య సిబ్బంది, ఉపాది సిబ్బంది, గ్రామపంచాయతీ సిబ్బంది,ప్రజలు పాల్గొన్నారు.