స్వచ్చభారత్ మిషన్ (గ్రామీణ) పైన మాడల్ జీపీలలో గ్రామ సభ

Swachabharat Mission (Rural) Above Model GPs Gram Sabhaనవతెలంగాణ – జుక్కల్

మండలంలోని పలు గ్రామ పంచాయతి గ్రామాలలో మండల పరిషత్ ఆధ్వర్యంలో ఎంపీవో రాము అద్యక్షతన స్వచ్చా భారత్ మీషన్ (గ్రామీణ)  ప్రత్యేక గ్రామసభ గురువారం నిర్వహించడం జర్గింది. ఈ సంధర్భంగా ఎస్బీఎమ్ మాడల్  జీపీలైన  హంగర్గ, కత్తల్ వాడీ, బిజ్దల్ వాడీ గ్రామ పంచాయతిలలో గ్రామసభ నిర్వహించి పలు ఆంశాల పైన గ్రామస్తులకు, యువకులకు అవగాహన చేయడం జర్గింది. ముఖ్యంగా గ్రామాలలో చెత్త చెదారం లేకుంజా నిత్యం శుభ్రం చేయించాలని, గ్రామస్తుల ఆరోగ్యానికి ప్రాదాన్యత ఇచ్చి శానీటేషన్, దోమల నివారణ, అంటురోగాలు నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీవో తో పాటు హంగర్గ జీపీ కార్యదర్శి అశోక్  గౌడ్ , గ్రామస్తులు, యువకులు, మహిళసంఘాలు, ఆశాలు,  తదితరులు పాల్గోన్నారు.