ఉపాధి హామీపై గ్రామసభ..

– తీర్మానాలు లేకుండానే లేకుండానే 12 లక్షల పని…
– ఇష్ట రాజ్యాంగ టి ఏ వ్యవహారం…
నవతెలంగాణ – పెద్ద కొడప్ గల్
మండలంలోని బేగంపూర్, కాస్లాబాద్, వడ్లం గ్రామపంచాయతీలోమహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం 2023-24 సంవత్సరాల లో జరిగిన పని గురించి సామాజిక తనిఖీ నిర్వహించారు.ఈ సందర్భంగా గురువారం వివిధ గ్రామపంచాయతీలో ప్రజల సమక్షంలో గ్రామసభలు నిర్వహించారు గ్రామ సభలో గ్రామంలో జరిగిన ఉపాధి హామీ పనుల గురించి ప్రస్తావించడం జరిగింది. ప్రస్తావనలో బేగంపూర్ గ్రామంలో12లక్షల పని కి తీర్మానం లేకుండానే జరిపించారని, సర్పంచ్ కార్యదర్శి సంతకాలు మాత్రమే ఉన్నాయని సూచించారు.చేనులో పని కూడిన రైతుల సంతకం కానీ కూలీల సంతకం కానీ లేవని, ఇస్తాను సారంగా వర్క్ ఐడీలు అమలు చేసి లక్షల బిల్లులు చేశారని అధికారులు సూచించారు.తీర్మానం లేకుండా పని ఇలా చేస్తారు అని గ్రామసభలు నిర్వహించకుండా పని ఇలా కల్పించాలని సూచించారు.రైతులు పొలం చేదును, రాళ్ల తొలగింపు పనులకు సంబంధించి పని జరిగినట్లు సూచించారు కానీ భూమి చదును చేయకుండా రాళ్ల తొలగింపు పని మాత్రమే జరిగిందని గ్రామసభలో తీర్మానించడం జరిగింది.పని ఒకటైతే పనిచేసుడు మరొకటి అయింది.బీడు భూములో పని చేయకుండా సాగు భూముల పని చేయించడం జరిగిందని ఫీల్డ్ అసిస్టెంట్ సూచించారు. 86వేల రూపాయలు బృహత్ పల్లె ప్రకృతి ట్రాక్టర్ ట్యాంకర్ కోసంనిధులు సూచించారు.313 మాస్టర్ల నిర్వాహన సరిగ్గా లేదని తెలిపారు.75 వేల రూపాయలు భూమి చెదును చేయకుండా చేసినట్లు టెక్నికల్ అసిస్టెంట్ బిల్లులు చేశారని తెలిపారు.28900 మట్టి పని కి బదులు రాళ్ల పని డబ్బులు తీసుకున్నారని తెలిపారు. తీర్మానం లేకుండా వర్క్ ఐడి ఎలా చేస్తారు గ్రామంలో అనుకూలంగా ఉన్న రైతు పొలంలో పని కల్పించారని తన వ్యక్తిగతంగా పని కల్పించినట్లు ఉన్నాయని ఫీల్ అసిస్టెంట్ సూచించారు.