– మండల స్థాయి అధికారులు పర్యవేక్షకులు….
– మండల ప్రత్యేక అధికారి డాక్టర్ ప్రదీప్ కుమార్
నవతెలంగాణ – అశ్వారావుపేట
తెలంగాణ ప్రభుత్వం ఈ ఏడాది గణతంత్ర దినోత్సవం నాటి నుండే నాలుగు పధకాలను అమలు చేయడానికి నిర్ణయించడంతో అధికార యంత్రాంగం ఈ నెల 21 నుండి 24 వరకు లబ్దిదారుల ఎంపిక కోసం నాలుగు రోజులపాటు గ్రామసభలు నిర్వహించనున్నారు. ఈ మేరకు మండల ప్రత్యేక అధికారి,పశుసంవర్ధక శాఖ అదనపు సంచాలకులు డాక్టర్ ప్రదీప్ కుమార్ స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం గ్రామసభలు షెడ్యూల్ ప్రకటించారు. 30 పంచాయితీల్లో నాలుగు రోజులపాటు ఉదయం కొన్ని సాయంత్రం కొన్ని పంచాయితీల్లో నిర్వహించాలని,ఈ గ్రామ సభలు ను నాలుగు బృందాలుగా,ఒక్కో బృందానికి తహశీల్దార్ క్రిష్ణ ప్రసాద్,ఎంపీడీఓ ప్రవీణ్ కుమార్,ఎం.పి.ఈ.ఓ సోయం ప్రసాద్ రావు,ఎం.ఏ.ఓ శివ రాంప్రసాద్ లు నాయకత్వం వహించనున్నారు అని తెలిపారు.బృందంలోని సభ్యులుగా స్థానిక పంచాయితీ రాజ్,రెవిన్యూ,వ్యవసాయ,ఉపాధి హామీ శాఖల సిబ్బంది వ్యవహరించనున్నారు. 21 వ తేదీ మంగళవారం దిబ్బ గూడెం, గుర్రాల చెరువు, జమ్మిగూడెం, కేసప్పగూడెం, మద్ది కొండ, మొద్దులమడ, పాతల్లిగూడెం, వేదాంతపురం. 22 వ తేదీ బుధవారం అచ్యుతాపురం, అనంతారం, ఆసుపాక, మల్లాయిగూడెం, నందిపాడు, నారంవారిగూడెం, ఊట్లపల్లి, పాతరెడ్డిగూడెం, రామన్నగూడెం. 23 వ తేది గురువారం బచ్చువారిగూడెం, కన్నాయిగూడెం, కావడి గుండ్ల, కొత్త మామిళ్ళవారిగూడెం, నారంవారిగూడెం కాలనీ, నారాయణపురం, పేరాయిగూడెం, వినాయక పురం. 24 వ తేదీ అశ్వారావుపేట, గాండ్లగూడెం, గుమ్మడి వల్లి, కోయ రంగాపురం, తిరుమల కుంటలో గ్రామ సభలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ప్రవీణ్ కుమార్, ఎంపీఈవో ప్రసాదరావు లు పాల్గొన్నారు.