– గ్రామ సభలకు ప్రజలు అందుబాటులో ఉండాలి
నవతెలంగాణ – తాడ్వాయి
మండలంలోని 18 గ్రామ పంచాయతీలలో ఈనెల 21 నుంచి అనగా రేపటినుండి 24వ తేదీ వరకు నాలుగు రోజులపాటు ప్రతిరోజు ఉదయం 9 గంటల మంచి మధ్యాహ్నం వరకు అన్ని గ్రామాలలో ప్రత్యేక గ్రామసభలు నిర్వహించనున్నట్లు తాడ్వాయి ఎంపీడీవో సుమన వాణి తెలిపారు. ఎంపీడీవో సున్నా వాని సోమవారం విలేకరులతో మాట్లాడుతూ రేపటినుండి జరిగే గ్రామసభలలో రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, అర్హులందరికీ రేషన్ కార్డుల వివరాలు గ్రామ సభ ముందు ఉంచబడతాయనీ ఆమె తెలిపారు. గ్రామ సభలలో రెవెన్యూ అగ్రికల్చర్ పంచాయతీరాజ్ అధికారులు గ్రామసభ నిర్వహించి ప్రజల సమక్షంలో లబ్ధిదారులను ఎంపిక చేయనున్నట్లు ఎంపీడీవో తెలిపారు. ఎవరైనా ఏ పథకం కోసమైనా లబ్ధి చేకూరడం కోసం దరఖాస్తు చేసుకోవాలని భావిస్తే, వారు గ్రామసభ లోనే ప్రత్యేకంగా ఏర్పరిచిన కౌంటర్లలో వారి దరఖాస్తులు ఇచ్చి రసీదు పొందవచ్చనారు.