మండలంలోని వివిధ గ్రామాలతో పాటు మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో, ఎమ్మార్వో కార్యాలయంలో, ఎంపీడీవో కార్యాలయంలో, మండల విద్యా వనరుల కార్యాలయంలో బుధవారం గాంధీ జయంతి వేడుకలను, గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వివిధ గ్రామాల్లో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ గ్రామ గ్రామ సభలను నిర్వహించారు. ఉప్పల్వాయి, కన్నాపూర్ సభల్లో డిపిఓ వామన్ రావు పాల్గొన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో తిరుపతి రెడ్డి, ఏ పి ఓ ధర్మారెడ్డి, ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లు, ఉపాధి హామీ కూలీలు తదితరులు పాల్గొన్నారు.