
చౌటుప్పల్ మండలంలో గ్రామసభలు ప్రశాంత వాతావరణంలో జరుగుతున్నాయని చౌటుప్పల్ మండల తాహాసిల్దార్ శివకోటి హరికృష్ణ మండల పరిషత్ అభివృద్ధి అధికారి బి.సందీప్ కుమార్ మండల అగ్రికల్చర్ అధికారి ముత్యాల నాగరాజు ఎంపీఓ ఉట్కూరు అంజిరెడ్డి ఆధ్వర్యంలో బుధవారం జరిగాయి. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సంక్షేమ పథకాల గ్రామసభలు ప్రస్తుతం నాలుగు సంక్షేమ పథకాలు అమలు కొరకు నిర్వహిస్తున్నారని మండల పరిషత్ అభివృద్ధి అధికారి సందీప్ కుమార్ తెలిపారు. ఈ గ్రామ సభల్లో నిజమైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు రేషన్ కార్డులు ఆత్మీయ భరోసా రైతు భరోసా పథకాలకు ఎవరికైనా లబ్ధి చేకూరకుంటే ఈ గ్రామ సభలో మరొకసారి దరఖాస్తు చేసుకోవచ్చని తాసిల్దార్ హరికృష్ణ తెలిపారు. ఈ కార్యక్రమంలో చౌటుప్పల్ ఏసిపి పటోళ్ల మధుసూదన్ రెడ్డి మాజీ మండల పరిషత్ అధ్యక్షులు తాడూరి వెంకట్ రెడ్డి ఆయా గ్రామాల మాజీ సర్పంచులు చక్రం జంగయ్య ఆల్మాసిపేట కిష్టయ్య కాయితి రమేష్ గౌడ్ చౌట వేణుగోపాల్ గౌడ్ కొలను శ్రీనివాస్ రెడ్డి గ్రామపంచాయతీ కార్యదర్శులు ప్రత్యేక అధికారులు పాల్గొన్నారు.