గ్రామసభలు నిర్వహించి అర్హులను ఎంపిక చేయాలి.

– మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు
నవ తెలంగాణ మల్హర్ రావు.
ప్రభుత్వ పథకాల్లో లబ్దిదారుల ఎంపికపై అధికారులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని జాతీయ కాంగ్రెస్ కార్యదర్శి, మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీదర్ బాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు పెద్దపల్లి మరియ భూపాలపల్లి జిల్లాలోని అన్ని మండలములోని గ్రామాలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పథకాలైన దళిత బందు, గృహలక్ష్మి, బీసీ బందు, మైనార్టీ బంధు పథకాలలో అర్హులను అధికారులు ఏ విధంగా గుర్తించడం జరిగిందో పూర్తి వివరాలు తెలుపుతూ జిల్లా అధికారులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.ఇల్లులేని నిరుపేదలకు గృహలక్ష్మి,అర్హులైన వారికి దళిత బందు, బీసీ, మైనార్టీ బందు అందేలా చూడాలన్నారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళిత బంధు, బీసీ బందు, గృహలక్ష్మి, మైనార్టీ బంధు ప్రభుత్వ పథకాలలో అర్హులను అధికారులు గుర్తించి మండల అభివృద్ది అధికారుల ద్వారా లబ్దిదారులను విచారణ చేసి తుది జాబితా ప్రకారం జిల్లా అధికారులు అర్హులను గుర్తించి వారికి మాత్రమే ఈ పథకాన్ని అమలు చేస్తున్నందున, ఈ లబ్దిదారుల జాబితాలో అనర్హులైన వారిని కూడా ఈ గుర్తించినట్లు మా దృష్టికి వచ్చినందున ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళిత బందు, బీసీ బందు, గృహలక్ష్మి, మైనార్టీ బందు ప్రభుత్వ పథకాలలో ఏ విధంగా అధికారులు గుర్తించడం జరిగిందో పూర్తి సమాచారం తెలుపుతూ జిల్లా అధికారులతో వెంటనే ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలన్నారు.