కాంగ్రెస్‌తోనే గ్రామ స్వరాజ్యం

– ఏఐసీసీ కార్యదర్శి చల్లా వంశీచంద్‌ రెడ్డి, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, టీపీసీసీ సభ్యులు ఆయిళ్ళ శ్రీనివాస్‌ గౌడ్‌
– కడ్తాల్‌ మండలంలోని చెల్లంపల్లి, వంపుగుడ గ్రామాల్లో ఆరు గ్యారంటీలపై విస్తత ప్రచారం
– డప్పుల దర్వులతో, మంగళ హారతులతో ఆహ్వానం పలికిన గ్రామస్తులు
– ప్రముఖుల సమక్షంలోకాంగ్రెస్‌లో చేరిన వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు
నవతెలంగాణ-ఆమనగల్‌
కాంగ్రెస్‌తోనే గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం వస్తుందని ఏఐసీసీ కార్యదర్శి డాక్టర్‌ చల్లా వంశీచంద్‌ రెడ్డి, కల్వకుర్తి అసెంబ్లీ కాంగ్రెస్‌ అభ్యర్థి కసిరెడ్డి నారాయణరెడ్డి, టీపీసీసీ కార్యవర్గ సభ్యులు ఆయిళ్ళ శ్రీనివాస్‌ గౌడ్‌ అన్నారు. నియోజకవర్గంలోని కడ్తాల్‌ మండలం కాంగ్రెస్‌ అధ్యక్షులు బిచ్యా నాయక్‌ ఆధ్వర్యంలో మంగళవారం మండలంలోని చెల్లంపల్లి, వంపుగుడ తదితర గ్రామాల్లో సోనియా గాంధీ ప్రకటించిన ఆరు గ్యారంటీ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు నిర్వహించిన గడప గడపకు కాంగ్రెస్‌ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వారు హాజరై మాట్లాడారు. ఎమ్మెల్యే తన సొంత గ్రామంలో డబుల్‌ బెడ్రూం ఇండ్ల నిర్మాణం కోసం వేసిన శిలాఫలకం శిథిలావస్థకు చేరుకుందని బీఆర్‌ఎస్‌ కోటకు బీటలు వారాయని చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలని వారు ఎద్దేవా చేశారు. ఇదే పరిస్థితి నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల్లో నెలకొందని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి రాగానే వంద రోజుల్లో ఆరు గ్యారంటీలతో పాటు ప్రజల అవసరాలకు అనుగుణంగా అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి వాటిని అమలు చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో భాగంగా ఆయా గ్రామాలకు చెందిన వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు ప్రముఖుల సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. కార్యక్రమంలో డీసీసీ అధికార ప్రతినిధి గూడూరు శ్రీనివాస్‌ రెడ్డి, ప్రధాన కార్యదర్శి బీక్యా నాయక్‌, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షులు యాట నర్సింహ ముదిరాజ్‌, ఎంపీపీ కమ్లి మోత్యా నాయక్‌, సింగిల్‌ విండో డైరెక్టర్‌ చేగూరి వెంకటేష్‌, కోఆప్షన్‌ సభ్యులు జహంగీర్‌ బాబా, సర్పంచ్‌ శంకర్‌, సురేందర్‌ రెడ్డి, నరేందర్‌, తిరుపతి రెడ్డి, ప్రవీణ్‌ రెడ్డి, ఎక్బాల్‌ పాషా, రాంచందర్‌ నాయక్‌, భాస్కర్‌ రెడ్డి, హన్మా నాయక్‌, వేణు పంతులు, యాదగిరి రెడ్డి, శ్రీకాంత్‌ రెడ్డి, కేశవులు, శాబుద్దీన్‌ తదితరులు పాల్గొన్నారు.