ఘనంగా 75వ గణతంత్ర వేడుకలు

నవతెలంగాణ – చిన్నకోడూరు 
భారత గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మండల వ్యాప్తంగా మువ్వన్నెల జెండాలు రెపరెపలాడాయి. మండల కేంద్రంలోని పలు ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు జాతీయ జెండాను ఆవిష్కరించారు. మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసిన అనంతరం జాతీయ పతాకాలను ఆవిష్కరించారు. తహశీల్దార్ కార్యాలయం వద్ద తహసీల్దార్ జయలక్ష్మి, ఎంపీడీవో కార్యాలయం ముందు ఎంపీడీవో శ్రీనివాస్, పోలీస్ స్టేషన్ వద్ద ఎస్ఐ సుభాష్ గౌడ్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద వైద్యాధికారిణి సరిత, వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయం వద్ద ఏఎంసి చైర్ పర్సన్ కొండం వనిత, అల్లీపూర్ సొసైటీ వద్ద సొసైటీ చైర్మన్ బొడిగె సదానందం గౌడ్, గ్రామపంచాయతీ కార్యాలయం ముందు సర్పంచ్ కాముని ఉమేష్ చంద్ర జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పలువురు వ్యక్తలు మాట్లాడుతూ భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతి ఒక్కరూ రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా ప్రజాస్వామ్య పరిరక్షణే ధ్యేయంగా నడుచుకోవాలన్నారు. అనంతరం దేశ స్వాతంత్ర్య సాధనకు ప్రాణాలర్పించిన నేతలకు ఘనంగా నివాళులర్పించారు. విద్యార్థిని, విద్యార్థులు వేసిన స్వాతంత్ర్య సమరయోధుల వేషధారణలు, సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి.