
సాయుధ పోరాటంలో అమరులైన అనభేరి ప్రభాకర్ రావు 76వ వర్ధంతిని సిపిఐ పార్టీ నాయకులు గురువారం ఘనంగా నిర్వహించారు. హుస్నాబాద్ పట్టణంలోని అనభేరి విగ్రహానికి సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి పూలమాలు వేసి నివాళులర్పించారు. అనంతరం మహ్మదపూర్ గ్రామంలోని గుట్టలో అమరులైన అనభేరి ప్రభాకర్ రావు, సింగిరెడ్డి భూపతిరెడ్డి,ముస్కు చొక్కా రెడ్డి, ఎలేటి మల్లారెడ్డి, అయిరెడ్డి భూంరెడ్డి, తూమెజు నారాయణ,బి దామోదర్ రెడ్డి, ఇల్లందుల పాపయ్య, పొరెడ్డి రాంరెడ్డి,నల్లగొండ రాజారాం,సిక్కొడు సాయిలు,రొండ్ల మాధవరెడ్డి ల అమరుల స్థూపం వద్ద ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నాయకులు మంద పవన్, గడిపే మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.