మండల కేంద్రంతో పాటు మండలంలోని ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల్లో,విద్యా సంస్థలు, వివిధ పార్టీలు, కుల సంఘాల ఆధ్వర్యంలో గురువారం 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. తహశీల్దార్ కార్యాలయంలో తహశీల్దార్ రాజా మనోహర్ రెడ్డి,ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓ శశికళ,పోలీస్ స్టేషన్లో ఎస్.ఐ రాజ వర్ధన్,ప్రెస్ క్లబ్ కార్యాలయంలో అధ్యక్షుడు చిలువేరు నర్సయ్య,మడల విద్యా వనరుల కేంద్రంలో ఎంఈఓ విజయ్ కుమార్ మండల ప్రభుత్వ వైద్యశాలలో డాక్టర్ ఉమాశ్రీ, పంకల్ మేజర్ గ్రామపంచాయతీలో, ఈవో రాహుల్, మండల వ్యవసాయ శాఖ కార్యాలయంలో ఏవో సంగీత,కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ముజాఫర్ అలీఖాన్,బి.ఆర్.ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు గుర్రం రాజారామ్ రెడ్డి,బీజేపీ మండల అధ్యక్షుడు గుండవరపు మధుసూదన్ రావు,బిజెవైఎం మండల అధ్యక్షుడు ముడుగు ప్రవీణ్,వైశ్య సంఘం మండల అధ్యక్షుడు జక్కు భూమేష్,వర్తక సంఘం అధ్యక్షుడు వొజ్జల వామన్,పొనకల్ రైతు వేదికలో ఏఈవో మల్యాల త్రిసంధ్య తో పలువురు జెండా ను ఎగురవేసి మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎన్ ఎస్ యు ఐ ఆధ్వర్యంలో మండలంలో ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. మండలంలోని అన్ని ప్రభుత్వ, విద్యాసంస్థల్లో, కార్యాలయాల్లో జాతీయ జెండాను ఆవిష్కరించి మిఠాయిలు పంచుకొని సంబరాలు నిర్వహించారు. అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.