నవతెలంగాణ- శంకరపట్నం
మండల కేంద్రంలోని గణేష్ రైస్ మిల్ ఆవరణలో వైభవంగా తనుకు ప్రభాకర్-నాగమణి అయ్యప్ప స్వామి 18 మెట్ల పడి పూజ మహోత్సవ కార్యక్రమాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు.ఈ పూజ కార్యక్రమానికి, మండలంలోని వ్యాపారవేత్తలు, వివిధ పార్టీల నాయకులు, బంధుమిత్రులు, స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజారి పోలోజు సుమన్ శాస్త్రి ఆధ్వర్యంలో జరిగిన హరిహర సుతుడు అయ్యప్ప స్వామి మహా పడిపూజ మహోత్సవ కార్యక్రమంలో అయ్యప్ప మాలధారణ స్వాములు 500 మంది పైగా పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. హర హర సుతుడు అయ్యప్ప స్వామి కీ వేదం మంత్రాలతో మెట్ల పూజ, దీపారాధన, అయ్యప్ప స్వామి జోల పాటలతో ఆ ప్రాంతమంతా మారుమోగింది, అనంతరం స్వాములకు, భక్తులకు అన్నదానం కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో తనుకు తిరుపతి, తనుకు ఓంకారం సత్యనారాయణ, తనుకు కుమారస్వామి, గాజుల శ్రీనివాస్, సురేష్, అభిలాష్, మండలంలోని రైస్ మిల్లు ల యజమానులు తదితరులు పాల్గొన్నారు.