పట్టణంలో ఘనంగా బక్రీద్ వేడుకలు..

నవతెలంగాణ – ఆర్మూర్ 

ముస్లిం సోదరుల అత్యంత పవిత్రత గల బక్రీద్ పండగ సంబరాలు సోమవారం ఘనంగా నిర్వహించినారు .పలు ఈద్గాలో మసీదుల వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేసినారు .ఈ సందర్భంగా మార్కాజ్ కమిటీ అధ్యక్షులు మే హినుద్దీన్ మాట్లాడుతూ దనిక, పేద అనే భేద భావాలు లేకుండా జరుపుకునే పండగ అని, ప్రపంచ వ్యాప్తంగా జరుపుకునే ఈ పండగ త్యాగనిరతికి అద్దం పడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ భర్త అయ్యప్ప శ్రీనివాస్, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు సాయి బాబా గౌడ్ ,బిసి సెల్ పట్టణ అధ్యక్షులు రమణ దొండి, మార్కాజ్ కమిటీ ఉపాధ్యక్షులు యండి అబ్దుల్ ముక్తార ను, జాయింట్ సెక్రెటరీ మమ్మద్ రిజ్వా ను ,ట్రెజరర్ సాజిద్ సాహెబ్ తదితరులు పాల్గొన్నారు.