ఘనంగా బండి సంజయ్ జన్మదిన వేడుకలు

నవతెలంగాణ – చండూరు 
కేంద్ర మంత్రి వర్యులు బండి సంజయ్  జన్మదిన వేడుకలు గురువారం మున్సిపల్ కేంద్రంలో  స్థానిక చౌరస్తాలో  బీజేపీ  మున్సిపల్  పట్టణ అధ్యక్షులు పందుల సత్యం గౌడ్  ఆధ్వర్యంలో  బాణా సంచా కాలిచి కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు.  అనంతరం  పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో  ఓబీసీ మోర్చా అధికార ప్రతినిధి   కోమటి వీరేశం, జిల్లా ఉపాధ్యక్షుడు సోమ నరసింహ,సముద్రాల వెంకటేశ్వర్లు, తాడిశెట్టి శ్రీధర్, మాధగోని నాగార్జున, ఓంకారం, శ్రీహరి, నకరికంటి లింగస్వామి, దూస గణేష్, భూతరాజు సోమేశ్, తదితరులు పాల్గొన్నారు.