
నిజామాబాదులో ఎమ్మెల్సీ కవిత క్యాంప్ కార్యాలయం వద్ద భారత్ జాగృతి ఆధ్వర్యంలో భోగి వేడుకలు ఆదివారం ఉదయం ఘనంగా నిర్వహించారు. బసవన్నల విన్యాసాలు భోగిమంటలతో సంబరాలు జరిపారు. సంక్రాంతి పండుగ అందరి జీవితాల్లో క్రాంతి నింపాలని జాగృతి నాయకులు ఆకాంక్షించారు. సంస్కృతి సంప్రదాయాలను విశ్వవ్యాప్తం చేసిన జాగృతి ఆధ్వర్యంలో ఇలాంటి పండగలు జరపటం ఆనవాయితీ అని జాగృతి నాయకులు తెలిపారు. సంప్రదాయ బద్దంగా జరిగిన ఈ వేడుకలు అందరినీ ఆకర్షించాయి. ఈ కార్యక్రమంలో నగర మేయర్ నితు కిరణ్ ,జాగృతి జిల్లా అధ్యక్షులు అవంతి రావు,రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు సుధం లక్ష్మి,జాగృతి రాష్ట్ర నాయకులు సుధాకర్, లక్ష్మీనారాయణ, మహిళా నాయకురాలు అపర్ణ, బి అర్ ఎస్ నాయకులు ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.