ఘనంగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తుమ్మలపల్లి శేఖర్ రెడ్డి జన్మదిన వేడుకలు

నవతెలంగాణ -పెద్దవూర
బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తుమ్మలపల్లి శేఖర్ రెడ్డి జన్మదిన వేడుకలను నందికొండ మున్సిపాలిటీ హిల్ కాలనీ లోని మాజీ మంత్రి జానారెడ్డి నివాసంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నాగార్జునసాగర్ ఎమ్మెల్యే కుందూరు జయవీర్ రెడ్డి పాల్గొని కాంగ్రెస్ నాయకులతో కలిసి కేక్ కట్ చేశారు.అనంతరం శాలువాతో సన్మానం చేసి తుమ్మలపల్లి శేఖర్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.ఈ వేడుకలో మాజీ కాంగ్రెస్ ఎంపీపీ శంకర్ నాయక్,మూడో అవార్డు కౌన్సిలర్ ప్రత్యేక సలహాదారుడు మోహన్ నాయక్, కాంగ్రెస్ నాయకులు చిన్ని, జంగయ్య, సాగర్ బాబు, గుంటి కోటేశ్వరరావు, సోషల్ మీడియా కన్వీనర్ మద్దాల భాను, రంగారెడ్డి,దత్తు,శన్ను,సూర్యచంద్ర, తదితరులు పాల్గొన్నారు.