ఘనంగా ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు

– ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి జన్మదిన వేడుకలు
నవతెలంగాణ – భువనగిరి: భువనగిరి పట్టణ 23వ వార్డులో పట్టణ యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో భువనగిరి శాసనసభ్యులు జనహృదయనేత కుంభం అనిల్ కుమార్ రెడ్డి జన్మదినం సందర్భంగా స్థానిక కౌన్సిలర్ పడిగెల రేణుక ప్రదీప్ అసెంబ్లీ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు అవేస్ చిస్తీ ఆధ్వర్యంలో బోయవాడ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేశారు. ఈకార్యక్రమంలో పిసిసి ప్రధాన కార్యదర్శి పోత్నక్ ప్రమోద్ కుమార్, మాజీ మున్సిపల్ చైర్మన్ బర్రె జహంగీర్, భువనగిరి అసెంబ్లీ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు అవేస్ చిస్తి , కౌన్సిలర్ రేణుక ప్రదీప్ పాల్గొని విద్యార్థులతో కేక్ కట్ చేసి విద్యార్థులకు భోజనం వడ్డించి పిల్లలతో కలిసి కూర్చొని భోజనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భువనగిరి గడ్డపై 40 ఏళ్ల చరిత్రను తిరగరాసి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా అత్యధిక మెజార్టీతో గెలుపొందిన జన హృదయ నేత కుంభం అనిల్ కుమార్ రెడ్డి అని పేర్కొన్నారు.
గత పది సంవత్సరాల నుండి నిత్యం భువనగిరి నియోజకవర్గంలోని పేద ప్రజలకు అందుబాటులో ఉంటూ ఎన్నో ప్రజాసేవ కార్యక్రమాలు చేస్తూ కరోనా కష్టకాలంలో కరోనా పేషెంట్లకు ఆక్సిజన్ సిలిండర్ అంబులెన్స్ సర్వీస్ డ్రైఫ్రూట్స్ కిడ్స్ మెడికల్ కిడ్స్ తన సొంత ఖర్చులతో కుంభం ఫౌండేషన్ ద్వారా అందించిన మహోన్నతమైన వ్యక్తి కుంభం అనిల్ కుమార్ రెడ్డి కొనియాడారు. భువనగిరి నియోజకవర్గంలో ప్రధాన సమస్యలపై బీఆర్ఎస్ ప్రభుత్వం పై అనేక ప్రజా ఉద్యమాలు చేస్తూ బీబీనగర్ నిమ్స్ హాస్పటల్ లో పేద ప్రజల కోసం వైద్యం సేవలను వెంటనే ప్రారంభించాలన్నారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండే నాయకున్ని ప్రజలు గుర్తించి 2023 అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీని బొంద పెట్టి కుంభం అనిల్ కుమార్ రెడ్డిని 27 వేల ఓట్ల మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలిపించుకున్నారు. రానున్న రోజుల్లో శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులతో ఆయురారోగ్యాలతో ఉంటూ ఉన్నతమైన పదవులు పొందలన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు నాయకులు గోపి బాబు, బర్రె నరేందర్, కసరబోయిన సాయి, దాసరి మధు, తోట మహేందర్, పట్నం వేణు, నువ్వుల రాజు, నక్కల జగదీష్, బర్రె క్రాంతి, ప్రభాకర్, పోచయ్య, గాయపాక స్వామి, గోపే రాజు, రేవంత్, సాయి బన్నీ పాల్గొన్నారు.