ఘనంగా గుత్తా జన్మదిన వేడుకలు

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్ర శాసనమండలి చైర్మెన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ , మాజీ మంత్రులు హరీష్‌ రావు ,వేముల ప్రశాంత్‌ రెడ్డి ఫోన్‌ ద్వారా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో డిప్యూటీ చైర్మెన్‌ బండ ప్రకాష్‌, ఎమ్మెల్సీ లు ఎమ్‌.యస్‌.ప్రభాకర్‌ రావు , భాను ప్రసాద రావు , మాజీ ఎమ్మెల్యే భాస్కర్‌ రావు, లేజిస్లేచర్‌ సెక్రెటరీ డాక్టర్‌ నరసింహాచార్యులు, బీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యదర్శి రమేష్‌ రెడ్డి తదితరులు గుత్తాకు శుభాకాంక్షలు తెలిపారు. నల్లగొండ జిల్లా ముఖ్య నేతలు, అభిమానులు, ఆత్మీయులు, శ్రేయోభిలాషులు, కార్యకర్తలు, సిబ్బంది తదితరులు ఆయన్ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.