
నం
పుట్టినరోజు సందర్బంగా చీరలు పంపిణీ చేసిన కౌన్సిలర్ శిరీష మోహన్ నాయక్:నందికొండ మున్సిపాలిటీ మూడవ వార్డు కౌన్సిలర్ శిరీష మోహన్ నాయక్ పుట్టినరోజు సందర్భంగా మున్సిపాలిటీ పారిశుద్ధ్య కార్మికులకు చీరలు పంపిణీ చేశారు. ప్రతి నిత్యం వేకువజామునే తమ విధి నిర్వహణలో నిమగ్నమై పరిసరాల పరిశుభ్రతకు పాటు పడుతూ తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ప్రజల ఆరోగ్య పరిరక్షిస్తున్న పారిశుద్య కార్మికుల కృషి ఎనలేనిదని అన్నారు. పారిశుధ్య కార్మికులకు చీరలు పంపిణీ చేయడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు ఈర్ల రామకృష్ణ,రమేష్ జి,మంగతా నాయక్,ఆదాస్ నాగరాణి విక్రమ్, మున్సిపల్ అధికారులు విజయ్ కుమార్,నిరంజన్,అర్చన, నాయకులు శ్రీనివాసరాజు చంద్రయ్య,ఊర శ్రీనివాస్,వీరయ్య మరియు మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.