తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పుట్టిన రోజు వేడుకలను శుక్రవారం నియోజక వర్గం కేంద్రం అయిన అశ్వారావుపేట లో ఆయన అనుచరగణం,అభిమాన శ్రేణి ఘనంగా నిర్వహించారు. తుమ్మల నాగేశ్వరరావు వీరాభిమాని బండి పుల్లారావు తనయుడు బండి భాస్కర్ నేతృత్వంలో బర్త్ డే కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు. అశ్వారావుపేట లోని మూడు రోడ్ల ప్రధాన కూడలిలో భారీ ప్లెక్సీ ఏర్పాటు చేసారు.సామాజిక ఆరోగ్య కేంద్రంలోని రోగులకు ఫ్రూట్ లు,బ్రెడ్ లు పంపిణీ చేసారు.అమ్మ సేవా సదనం వృద్దులు ఆశ్రమంలో నిరాశ్రయులు కు విందు ఏర్పాటు చేసారు. ఈ కార్యక్రమాల్లో జ్యేష్ట సత్యనారాయణ,ఎస్.కే పాషా,సత్యవరపు బాలగంగాధర్,పాలవలస జీవన్ రావు,నార్లపాటి మహేష్,జల్లిపల్లి దేవరాజు లు పాల్గొన్నారు.