
నాగార్జున సాగర్ ఎమ్మెల్యే కుందూరు జయవీర్ రెడ్డి జన్మదిన వేడుకలు మంగళవారం నాగార్జున సాగర్ మున్సిపాలిటీలోని ఎంఎల్ఏ ఇంట్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్దవూర మండలం యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో సన్మానించి 100 కిలోల కేక్ కట్ చేసి షాలువాతో గణ సన్మానం చేశారు. పార్టీశ్రేణులు, నాయకులు కలిసి నాగార్జున సాగర్ ప్రభుత్వ ఆస్పత్రిలో రక్తదాన శిబిరం నిర్వహించారు. మండలం కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు పండ్లు బ్రేడ్ పంపిణి చేశారు. ఈ కార్యక్రమం మండల సీనియర్ నాయకులు మాజీ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ కర్నాటి లింగారెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తుమ్మలపల్లి చంద్రశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పబ్బుగిరి ,యూత్ నాయకులు సతీష్ , కిలారి మురళి యాదవ్ , రాజా రమేష్ యాదవ్, శిశుపాల్ రెడ్డి, దండు బిక్షం, పగడాల నాగరాజు,కిలారీ మురళీకృష్ణ,రేపాకుల సాయి మండల నాయకులు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.