ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి వేడుకలు

నవతెలంగాణ -తాడ్వాయి 
మండలంలోని కాటాపూర్ లో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 38వ వర్ధంతి వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు పుల్లూరి నరసింహ జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా నరసింహ మాట్లాడుతూ అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేసిన మహనీయుడు జగ్జీవన్ రామ్ అన్నారు. భారత ప్రజలకు లభించిన అమూల్యరత్నం అని కొనియాడారు. అంబేద్కర్ సాధించి పెట్టిన రిజర్వేషన్లను అమలుపరచిన ఘనత ఈయనకే దక్కుతుందన్నారు. కార్మిక శాఖ మంత్రిగా, నెహ్రూ మంత్రివర్గంలో పనిచేశారన్నారు. జగ్జీవన్ రామ్ ఆశయాలను, సేవలను స్పూర్తిగా తీసుకొని ప్రతి దళితుడు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ప్రజలందరూ రాజకీయంగా ఎదగాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎల్ పి శ్రావణ్, మబ్బు సురేష్, పుల్లూరి రాజు, రామ స్వామి, చిరంజీవి, పాల్, దేవేందర్, మాస్ తదితరులు పాల్గొన్నారు.