ఘనంగా కాంగ్రెస్ నాయకుడు నాగరాజు జన్మదిన వేడుకలు

– శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే సామెల్
నవతెలంగాణ – నూతనకల్
కాంగ్రెస్ పార్టీ మండల సీనియర్ నాయకులు తుంగతుర్తి శాసనసభ సభ్యుల ముఖ్య వ్యక్తిగత అనుచరుడు పాల్వాయి నాగరాజు జన్మదిన వేడుకలు ఆదివారం తిరుమలగిరి మండల కేంద్రంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే మందుల సామెల్ సమక్షంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా  శాసనసభ సభ్యును  తో కలిసి కేక్ కట్ చేసి మిఠాయిని పంపిణీ చేశారు. అనంతరం జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. శుభాకాంక్షలు తెలిపిన వారిలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నాగం సుధాకర్ రెడ్డి తిరుమలగిరి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పాలకుర్తి రాజయ్య నాయకులు సుంకరి జనార్ధన్, సాబాది వాసుదేవరెడ్డి ,భద్రాచలం నాగేశ్వరరావు, నియోజకవర్గస్థాయి కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.