ఘనంగా కాంగ్రెస్‌ నాయకుల జన్మదిన వేడుకలు

– తాండూరులో ఘనంగా కాంగ్రెస్‌ నాయకులు మున్సిపల్‌ మాజీ చైర్‌ పర్సన్‌ సునీత సంపత్‌, కాంగ్రెస్‌ వి బ్లాక్‌ అధ్యక్షులు భీమ్‌ శెట్టి అనిల్‌ కుమార్‌ జన్మదిన వేడుకలు
– పాల్గొన్న ఎమ్మెల్యే మనోహర్‌ రెడ్డి
– నాయకుల జన్మదినం సందర్భంగా రక్తదానం చేసిన 140 మంది యువకులు
నవతెలంగాణ-తాండూరు
తాండూరు పట్టణ కేంద్రంలో ఆదివారం కాంగ్రెస్‌ పార్టీ నాయకుల జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. తాండూర్‌ మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ సునీత సంపత్‌, కాంగ్రెస్‌ పార్టీ బి బ్లాక్‌ అధ్యక్షులు భీమ్‌ శెట్టి అనిల్‌ కుమార్‌ పుట్టినరోజు వేడుక సందర్భంగా నియోజకవర్గంలోని 140 మంది యువకులు రక్తదానం చేశారు. కాంగ్రెస్‌ పార్టీ నాయకుల జన్మదినం సందర్భంగా వివిధ గ్రామాల నాయకులు కార్యకర్తలు వచ్చి శాల్వా పూలమాలతో మాజీ మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ సునీత సంపత్‌ను, కాంగ్రెస్‌ పార్టీ బి బ్లాకు అధ్యక్షులు భీమ్శెట్టి అనిల్‌ కుమార్‌ను సన్మానించారు. కాంగ్రెస్‌ పార్టీ నాయకుల జన్మదిన వేడుకలు ఎమ్మెల్యే మనోహర్‌ రెడ్డి కూడా పాల్గొని పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సంక్రాంతి భోగి పండుగ తాండూర్‌ నియోజకవర్గం ప్రజలకు, శుభాకాంక్షలు తెలిపారు, ఆయురారోగ్యాలతో జన్మదినం జరుపుకుంటున్న నాయకులను ఆ భగవంతుడు చూడాలని కోరుకుంటున్నమన్నారు. పార్టీ నాయకులు ఆహ్లాదకరమైన వాతావరణం లో ఇంత మంది పార్టీ నాయకులు, అభిమానులు, శ్రేయోభిలాషుల మధ్యన జరుపుకోవడం ఎంతో సంతోషం వేసిందన్నారు. జన్మదినం సందర్బంగా రక్తదాన శిబిరం నిర్వహించడం 140 మంది యువకులు రక్తదానం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో యాలాల ఎంపీపీ తాలపల్లి భాళేశ్వర్‌ గుప్తా, కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు డాక్టర్‌ సంపత్‌ కుమార్‌, డాక్టర్‌ శరత్‌ చంద్ర, తాండూర్‌ కాంగ్రెస్‌ పార్టీ టౌన్‌ అధ్యక్షులు సయ్యద్‌ అభీబ్‌ లాల.యాలాల్‌ మండలం అధ్యక్షులు భీమయ్య,భాతుల వెంకటేష్‌,పట్లోళ్ళ నర్సిములు, కౌన్సిలర్‌ నీరజ భాల్‌ రెడ్డి.ఆర్య వైశ్య సంఘం నాయకులు,వర్కింగ్‌ ప్రెసిడెంట్‌. శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.