ఘనంగా కౌన్సిలర్‌ కౌడే మహేష్‌ జన్మదిన వేడుకలు

నవతెలంగాణ- మేడ్చల్‌
మేడ్చల్‌ మున్సిపాలిటీ 23వ వార్డు కౌన్సిలర్‌ కౌడే మహేష్‌ కురుమ జన్మదిన వేడుకలు శనివారం ఘనంగా జరుపుకున్నారు. మేడ్చల్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి తోటకూర వజ్రేష్‌ యాదవ్‌, కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు సింగిరెడ్డి హరివర్ధన్‌ రెడ్డిలను వేరువేరుగా వారి నివాసాల్లో కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా వారు కౌన్సిలర్‌ కౌడే మహేష్‌ కు శాలువా కప్పి సన్మానించి కేక్‌ కట్‌ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్తులో మరెన్నో ఉన్నత పదవులు చేపట్టాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వైస్‌ చైర్మెన్‌ చీర్ల రమేష్‌ కురుమ, కౌన్సిలర్లు జాకట దేవ, పెంజర్ల స్వామి యాదవ్‌, సముద్రం సాయికుమార్‌, రొయ్యపల్లి మల్లేష్‌ గౌడ్‌, బత్తుల మధుకర్‌ యాదవ్‌, రొయ్యపల్లి మల్లేష్‌ గౌడ్‌,కో ఆప్షన్‌ సభ్యులు ఆకిటి నవీన్‌ రెడ్డి, ఎన్‌ఎస్‌యూఐ నాయకులు లవంగు రాకేష్‌ వంజరి, గుండ శ్రీధర్‌ కురుమ, యువ నాయకులు నర్సింగ్‌ కురుమ, మహ్మద్‌ ఇద్రీస్‌, పెంజర్ల సాయికుమార్‌ యాదవ్‌, సయ్యద్‌ అఖిల్‌, శేఖర్‌ రెడ్డి, చింటు తదితరులు పాల్గొన్నారు.