ఘనంగా మాజీ ముఖ్యమంత్రి  కేసీఆర్ జన్మదిన వేడుకలు 

నవతెలంగాణ – మల్హర్ రావు
బీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ 70వ పుట్టినరోజు వేడుకలు బీఆర్ఎస్ మంథని నియోజకవర్గ ఇంచార్జి, పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్ ఆదేశాల మేరకు శనివారం మండలం కేంద్రమైన తాడిచర్లలో మండల బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు,పండ్లు పంచారు.ఈ కార్యక్రమంలో తాడిచెర్ల ఎంపీటీసీ-1 రావుల కల్పన మొగిలి, పిఏసీఎస్ వైస్ చైర్మన్ మల్కా ప్రకాష్ రావు, మంథని మార్కెట్ డైరెక్టర్ రాజేశ్వర్ రావు, రామిడి గట్టయ్య,మదుసుధన్ రావు,ఆర్ని సత్యనారాయణ, రాజేశం,సదానందం,సతీష్,కామ బాపు పాల్గొన్నారు.