
ఉమ్మడి నల్గొండ జిల్లా అభివృద్ధి ప్రదాత మాజీ మంత్రివర్యులు సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీశ్ రెడ్డి జన్మదిన వేడుకలు తిరుమలగిరి మున్సిపాలిటీ పరిధిలోని తెలంగాణ చౌరస్తాలో అధ్యక్షులు సంకేపల్లి రఘునందన్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రివర్యులు జగదీశ్ రెడ్డి పుట్టినరోజు కేకును కట్ చేసి స్వీట్ పంపిణీ చేశారు.అనంతరం అధ్యక్షులు సంకేపల్లి రఘునందన్ రెడ్డి మాట్లాడుతూ మాజీ మంత్రివర్యులు గుంటకండ్ల జగదీశ్ రెడ్డి మొదటి నుంచి ప్రజా ఉద్యమాల్లో విప్లవ ఉద్యమ విద్యార్థి నాయకుడిగా ఎదిగి, ఎలాంటి స్వార్థం లేకుండా నికార్సైన తెలంగాణ బిడ్డగా తెలంగాణ ఉద్యమం కోసం పనిచేసి కెసిఆర్ సహకారంతో సూర్యాపేట నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో మూడుసార్లు శాసనసభ్యులుగా ఎన్నిక కావడం గొప్ప విషయం అన్నారు. అదేవిధంగా ఉమ్మడి నల్లగొండ 10 సంవత్సరాలు ఏకదాటిగా ఏకైక మంత్రిగా చేయడం గొప్ప విషయం అన్నారు. వారి పాలనలోనే సూర్యాపేట జిల్లాగా ఏర్పడి, నియోజకవర్గం మునుపెన్నడు లేని విధంగా అభివృద్ధి చేసిన ఘనత వారికే దక్కిందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కొమ్మినేని సతీష్, నాయకులు దూపటి రవీందర్, మోడెపు సురేందర్,కందుకూరి ప్రవీణ్, కందుకూరి బాబు, ఆకుల వీరయ్య, బర్ల వెంకన్న, యాకూబ్ నాయక్, అడ్డబొట్టు చారి, త్రిశూల్, నాయుడు, మల్లేష్ తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.