– జిల్లా ప్రధాన కార్యదర్శి మీసం నాగరాజ్ యాదవ్
నవతెలంగాణ – చిన్నకోడూరు
రాబోయే రోజుల్లో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యేవిధంగా ప్రతి కార్యకర్త కంకణ బద్దులై సైనికునిలా పని చేయాలని పిలుపునిచ్చారు. చిన్నకోడూరు మండలం కేంద్రంలో రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను డీసీసీ ప్రధాన కార్యదర్శి మీసం నాగరాజు యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా ప్రభుత్వ దవాఖానలో రోగులకు పండ్లు, బ్రేడ్స్ పంపిణి చేసారు. కాంగ్రెసు ప్రభుత్వం తోనే ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మీసం మహేందర్ యాదవ్, యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ సెక్రటరీ కల్లూరి నర్సయ్య, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు ఉడుత జయంత్, వర్కింగ్ ప్రెసిడెంట్ బత్తిని గణేష్, యూత్ కాంగ్రెస్ మండల మాజీ అధ్యక్షులు సందబోయిన పర్శరాం, ఉపాధ్యక్షలు కాలువ జగన్, యూత్ కాంగ్రెస్ సెక్రెటరీలు మహేందర్, మాసం శేషు, నాయకులు ఇరుమల్ల ఎల్లయ్య, మధు, రాయమల్లు తదితరులు పాల్గొన్నారు.