ఘనంగా మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలు..

– ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహణ..
నవతెలంగాణ – అశ్వారావుపేట
తెలంగాణ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు జన్మదిన వేడుకలను అశ్వారావుపేట లో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఇందుకు గాను స్థానిక క్యాంపు కార్యాలయంలో ఏర్పాట్లు చేసారు.ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన మెచ్చా నాగేశ్వరరావు ప్రజా ప్రతినిధులు, మండల స్థాయి నాయకులతో కలిసి బర్త్ డే కేక్ కట్ చేశారు. అనంతరం ఎం.పి.పి శ్రీరామ మూర్తి ఆద్వర్యంలో స్థానిక మహాత్మా జ్యోతి రావు ఫూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల గురుకుల ఆశ్రమ బాలురు వసతి గృహంలో కెటిఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు చేతులు మీదుగా బర్త్ డే కేక్ కట్ చేసి విద్యార్ధులకు బిస్కెట్, చాక్లెట్ లు పంపిణీ చేసారు. బీఆర్ఎస్ యువజన విభాగంలో ఆద్వర్యంలో 50 కేజీల టమాటా లను పట్టణంలోని పేదలకు పంపిణీ చేసారు. ఈ కార్యక్రమాల్లో జెడ్.పి.టి.సి వరలక్ష్మి,పైడి వెంకటేశ్వరరావు,వైస్ ఎం.పి.పి ఫణీంద్ర, కళాశాల ప్రిన్సిపాల్ మంజుల, నాయకులు మందపాటి రాజమోహన్ రెడ్డి, యు.ఎస్ ప్రకాశ్ రావు, తాడేపల్లి రవి, పూర్వ సర్పంచ్ సీమకుర్తి వెంకటేశ్వరరావు, సత్యవరపు సంపూర్ణ, నార్లపాటి రాములు, మోటూరు మోహన్, శెట్టిపల్లి రఘురాం, సతీష్ రెడ్డి లు పాల్గొన్నారు.