నవతెలంగాణ -వలిగొండ రూరల్ : మండల పరిధిలోని వివిధ గ్రామాలలో ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి జన్మదిన వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించినారు. శ్రీ మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు కొమ్మారెడ్డి నరేష్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ కుంభం వెంకట పాపిరెడ్డి, కాంగ్రెస్ జిల్లా నాయకులు బత్తిని సహదేవ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, పండ్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.