నవతెలంగాణ – వేములవాడ : తెలంగాణ ప్రజల స్వరాష్ట్ర కలను సాకారం చేసిన సోనియా గాంధీ 77వ జన్మదిన వేడుకలను శనివారం వేములవాడ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు గావించి కోడె మొక్కును చెల్లించుకున్నారు.అనంతరం ఆలయ ముందు భాగంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాలుగున్నర కోట్ల ప్రజల ఆకాంక్షల మేరకు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి తల్లి సోనియా గాంధీ జన్మదిన వేడుకలు జరుపుకోవడం సంతోషకరంగా ఉందన్నారు.సోనియా గాంధీకి గిఫ్టుగా తెలంగాణ ప్రజలు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం కట్టబెట్టారని పేర్కోన్నారు.వారి జన్మదిన సందర్భంగా ఆరు గ్యారెంటీలో రెండు గ్యారెంటీలను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమలు చేశారని తెలిపారు.అందులో ముఖ్యంగా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం,ఆరోగ్యశ్రీ 10 లక్షల పెంచుతూ అమలుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టారని తెలిపారు.రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో కూడా అధికారంకి రాబోతుందని ఆకాంక్షించారు. వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సారథ్యంలో అన్ని వర్గాల ప్రజలు అభివృద్ధి సాధిస్తారని తెలిపారు.ఈ కార్యక్రమంలో పట్టణ బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్, సాగరం వెంకటస్వామి కౌన్సిలర్లు బింగి మహేష్, వంగల దివ్య శ్రీనివాస్ నాయకులు కూరగాయల కొమురయ్య, పుల్కం రాజు, పాత సత్యలక్ష్మి, సూగూరి లక్ష్మి, చిలుక రమేష్, పులి రాంబాబు గౌడ్, పీర్ మహమ్మద్, కనికరపు రాకేష్, నాగుల రాము గౌడ్, వస్తాదు కృష్ణ గౌడ్, కోయల్ కార్ మస్తాన్, నాగుల విష్ణు, కోలాకాని రాజు, తోట రాజు, తోటలహరి, బొజ్జ భారతి, అక్కన పెళ్లి నరేష్, ముప్పిడి శ్రీధర్, ముంజ ఉమేందర్, కూర దేవయ్య, అబ్దుల్ రజాక్, దండుగుల తిరుపతి, కోయీనేని శ్రీనివాస్, అరుణ్ తేజ చారి, నాగుల మహేష్, లింగంపల్లి కిరణ్, గంటల ప్రకాష్, సాబీర్, కుతాడి రాజేశం, సిరిగిరి శ్రీకాంత్, బొందిలా మహేష్, మహాదేవుని అంజయ్య, మండే రాజు, దాడి మల్లేశం,వలి, మర్రిపల్లి రాజు, ఆటో లింగం లతో పాటు పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు.