ఘనంగా రాహుల్ గాంధీ గారి జన్మదిన వేడుకలు

నవతెలంగాణ – పెద్దకొడప్ గల్
కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులు రాహుల్ గాంధీ గారి జన్మదినం సందర్బంగా పెద్దకొడప్ గల్ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి మిఠాయిలు తినిపించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూరాహుల్ గాంధీని ఆ భగవంతుడు ఆయురారోగ్యాలతో సుఖంగా జీవించాలని ఆ భగవంతున్ని కోరుకుంటున్నామన్నారు ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు మహేందర్ రెడ్డి,మోహన్ బస్వరాజ్,సంజీవ్,కాంత రెడ్డి, విట్టల్,రషీద్,శ్రీనివాస్,నాగరాజు పార్టీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.