
నవతెలంగాణ – మల్హర్ రావు
ఉమ్మడి రాష్ట్ర మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు తనయుడు, తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సోదరుడు,శ్రీపాద ట్రస్ట్ చైర్మన్, కాంగ్రెస్ యువ నాయకుడు దుద్దిళ్ల శ్రీను బాబు జన్మదిన వేడుకలు మండలంలోని కొయ్యుర్, రుద్రారం,కొండంపేట, తాడిచెర్ల గ్రామాల్లో ఘనంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బడితేల రాజయ్య ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ సందర్భంగా కొందంపేట గ్రామంలో ఎంపిటిసి ఏనుగు నాగరాని లక్ష్మి నారాయణ ఆధ్వర్యంలో అంగన్ వాడి చిన్నారులకు పెన్నులు,చాక్లెట్స్,బిస్కెట్స్ పంపిణీ చేశారు.ఈ సందర్భంగా పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కేక్ కట్ చేసి స్వీట్లు పంచి శ్రీనుబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి కొండ రాజమ్మ, సింగిల్ విండో డైరెక్టర్లు ఇప్ప మొoడయ్య,వొన్న తిరుపతి రావు,జిల్లా ఎస్టీ సెల్ ప్రధాన కార్యదర్శి సవేందర్,మమత,మల్లారెడ్డి,బాలయ్య,శ్రీనివాస్ రెడ్డి,బద్దీ సమ్మక్క,పుష్ప పాల్గొన్నారు.