నవతెలంగాణ మల్హర్ రావు: కాటారం మండలంలోని అంబేద్కర్ చౌరాస్తాల్లో శనివారం బేడ బుడగ జంగం హక్కుల పోరాట సమితి, 22వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించి, జెండాను ఆవిష్కరించినట్లుగా బేడ బుడగ జంగాల హక్కుల పోరాట సమితి భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు తూర్పాటి రజనీకాంత్ తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. బిజెహెచ్ పిఎస్ వ్యవస్థాపకులు సిరిగిరి మన్నెం, వ్యవస్థాపక గౌరవ అధ్యక్షులు గగనం మంతప్ప ,వ్యవస్థాపక చైర్ పర్సన్ గగనం శ్రీనివాసులు, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కోడిగంటి నరసింహ, రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షులు యడవల్లి వీరప్ప, రాష్ట్ర కోశాధికారి తుర్పటి శ్రీను, రాష్ట్ర యూత్ ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు సిరివాటి రమేష్ తదితరులు ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో బిజెహెచ్ పిఎస్ నాయకులు పాల్గొన్నారు.