
మండల కేంద్రంలో జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. మండలంలో ఆయా గ్రామాల్లో బాబు జగ్జీవన్ రామ్ విగ్రహంతో పాటు చిత్రపటాలకు పూలమాలవేసి శుక్రవారం నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ ఫ్లోర్ లీడర్ నా రెడ్డి మోహన్ రెడ్డి, స్థానిక సెక్రటరీ క్రాంతి కుమార్ తో పాటు పలువురు మాట్లాడుతూ.. జగ్జీవన్ రామ్ అంటరానితనంపై అలుపెరగని పోరాటం చేశారని, భారత స్వతంత్ర ఉద్యమంలో, భారతదేశం స్వతంత్రం వచ్చిన తర్వాత అభివృద్ధిలో ఎంతో కృషి చేశారని కొని ఆడారు. కార్యక్రమంలో ప్రజలు తదితరులు పాల్గొన్నారు.