నవతెలంగాణ-కోహెడ : మండల కేంద్రంలోని పాత బస్టాండ్ ప్రాంగణంలో ఆదివారం తెలంగాణ ఉద్యమకారిణి, వీరవనిత చాకలి ఐలమ్మ 38వ వర్ధంతి వేడుకలను మండల రజక సంఘం నాయకులు జాలిగం శంకర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూల మాలలు వేసి రైతాంగ సాయుధ పోరాటంలో ఆమె చేసిన వీరోచిత పోరాటాన్ని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో కో-ఆప్షన్ సభ్యులు అబ్దుల్ ఖదీర్, మాజి జడ్పీటీసీ పొన్నాల లక్ష్మణ్, బీఆర్ఎస్ పార్టీ మండల ఉపాధ్యక్షులు తిప్పారపు నాగరాజు, గ్రామ శాఖ కార్యదర్శి బండ వెంకటస్వామి, రజక సంఘం అధ్యక్షులు జాలిగం చంద్రయ్య , మాజీ సర్పంచ్ మంద రాజయ్య , వార్డు సభ్యులు తెలు యాదగిరి, పెండెల ఐలయ్య , మోత్కుల ఐలయ్య, జాలిగం రాజు , బస్వరాజు రాకేష్, బస్వరాజు రాజశేఖర్, జాలిగం శంకర్, జాలిగం శ్రీనివాస్ , గుగ్గిళ్ల కార్తిక్, అఖిల్ , దుంబలా మధు, గూడ చంద్రయ్య, జాలిగం పోచయ్య, షాబీర్, జాలిగం స్వామి , శ్రావనపల్లి కనకయ్య, బండ పెంటయ్య, శ్రీనివాస్, వేముల శంకరయ్య, రజక సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.