నవతెలంగాణ- పెన్ పహాడ్: మండల పరిధిలోని అనాజిపురం ఆదర్శ పాఠశాలలో దేశ మొదటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా బాలల దినోత్సవ వేడుకలను మంగళవారం పాఠశాల ప్రిన్సిపల్ జి ప్రమీల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం విద్యార్థులు స్వతంత్ర ఉద్యమ నాయకుల వేషధారణలో పాల్గొని సాంస్కృతిక కార్యక్రమాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.