ఘనంగా “డాక్టర్స్ డే” వేడుకలు..

నవతెలంగాణ – తాడ్వాయి 
మండల వ్యాప్తంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో శుక్రవారం “డాక్టర్స్ డే” వేడుకలను ఘనంగా నిర్వహించారు. కాటాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ వి రంజిత్ ను వైద్య సిబ్బంది శాలువాలు కప్పి పుష్పగుచ్చం అందించి ఘనంగా సన్మానించారు. అనంతరం కేక్ కట్ చేశారు. వైద్యులు డాక్టర్ రంజిత్, హెచ్ ఇ వో సమ్మయ్య లు మాట్లాడుతూ అసంక్రమిత వ్యాధుల నియంత్రణలో విశేష కృషి చేసిన వైద్య సిబ్బంది అందరిని వైద్యాధికారి సన్మానించారు. కరోణ సమయంలో ప్రాణాలకు తెగించి వైద్య సేవలను అందించిన సిబ్బందిని అభినందించారు. ఈ కార్యక్రమంలో హెచ్ ఈ ఓ సమ్మయ్య, ఫార్మసిస్ట్ శివరంజని, ఏఎన్ఎంలు రాజేశ్వరి, గంగా, పుష్ప, చంద్రకళ, ఎల్లారమ్మ, నవలోక, హెల్త్ అసిస్టెంట్లు అనిల్, ముత్తయ్య, ల్యాబ్ టెక్నీషియన్ కుర్సం శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.