ఘనంగా డాక్టర్స్ డే వేడుకలు..

– డాక్టర్ రాధాకృష్ణమూర్తి సన్మానించిన కౌన్సిలర్  స్వామి..
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
భువనగిరి జిల్లా కేంద్రంలోని డాక్టర్   రాధాకృష్ణ మూర్తి హాస్పటల్లో డాక్టర్ డే సందర్భంగా డాక్టర్ రాధాకృష్ణమూర్తి పుట్టినరోజు  సందర్భంగా కేక్ కటింగ్ చేసి, 8 వ వార్డ్ కౌన్సిలర్  కౌన్సిలర్ పంగ రెక్క స్వామి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ ప్రాణాలను కూడా ఫణంగా పెట్టి రోగులకు సేవలందించిన డాక్టర్‌  రాధాకృష్ణ మూర్తి  అని అన్నారు.  వారికి సహకరిస్తున్న కుటుంబ సభ్యులకు, పేరు పేరునా మరోసారి అభినందిస్తున్నానని ,  రాష్ట్ర ప్రజల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా, తెలంగాణను ఆరోగ్య తెలంగాణగా మార్చడమే ధ్యేయంగా, రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ చేపట్టిందని తెలిపారు.   ఈ క్రమంలో డాక్టర్లు, ఈఎస్ఐ హాస్పటల్ సూపర్డెంట్ ప్రశాంత్ కుమార్, కర్ణాకర్, రిత్విక్ ,మధు ,రాజు కుమార్ ,సాయి, మహేష్,  నర్సులు, స్వప్న ,అశ్విని,అనుష ,శ్రీలత,పల్లవి, భార్గవి, భవాని, ఆయమ్మలు సిబ్బంది పాల్గొన్నారు.