
ఘనంగా డాక్టర్ తాటికొండ రాజయ్య 63వ జన్మదిన వేడుకలను మండల కేంద్రంలో కొట్టే పద్మయ్య మొగిలి ఆధ్వర్యంలో శనివారం ఘనంగా జరుపుకున్నారు.ఈ సందర్భంగా మొగిలి మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో అధికార పార్టీలో ఎమ్మెల్యేగా కొనసాగుతూ తెలంగాణ ఉద్యమం కనుమరుగు అవుతున్న సమయంలో అధికార పార్టీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తెలంగాణ ఉద్యమంలో అగ్రభాగంలో నిలిచిన వ్యక్తి డాక్టర్ తాటికొండ రాజయ్య అని అన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ గ్రామాన తిరుగుతూ ఉద్యమాన్ని ముందు వరసలో నిలిపిన వ్యక్తి డాక్టర్ రాజన్నని కొనియాడారు.తెలంగాణ సాధించుకున్న అనంతరం తెలంగాణ తొలి ఉపముఖ్యమంత్రిగా చేసి హెల్త్ యూనివర్సిటీ ని సాధించిన మొదటి వ్యక్తి రాజన్నని అన్నారు.బడుగు బలహీన వర్గాల కోసం నిరంతరం నియోజకవర్గ ప్రజలే నా దేవుళ్ళు నిజంగా నియోజకవర్గమైన దేవాలయం అనే నినాదంతో గ్రామ గ్రామాన తిరుగుతూ ప్రజలకు సేవ చేసిన ఘనత రాజన్నకు దక్కుతుందని అన్నారు. కరోనా సమయంలో వ్యాధిని లెక్కచేయకుండా నేనున్నానంటూ బాధితులకు అండగా నిలిచిన మహోన్నత వ్యక్తి అని అన్నారు. ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు జీవించాలని మరింత ప్రజలకు సేవ చేసే భాగ్యం కలగాలని కోరారు.ఈ కార్యక్రమంలో సింగిల్ విండ మాజీ చైర్మన్ మునిగాల యాకోబ్,మాజీ ఎంపిటిసి ఇనగల మల్లేశం,పొన్నాల రమేష్,బీర మధుకర్,బాలస్వామి, మడుగుల శంకర్,మాచర్ల బాబు, మాచర్ల సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.