
తెలంగాణ రాష్ట్ర మాజీ సీఎం కేసీఆర్ 70వ పుట్టినరోజు వేడుకలను బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు టంగుటూరి రాజకుమార్ ఆధ్వర్యంలో శనివారం స్థానిక గాంధీ చౌరస్తాలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ దేశిని స్వప్నకోటి కౌన్సిలర్లు గాజుల భాస్కర్, దయ్యాల శ్రీనివాస్ నాయకులు మొ లుగుదిలీప్, పొలసాని మనోహర్ రావు, భోగం వెంకటేష్, ముద్రగడ నవీన్ కుమార్, బుర్ర శ్రీనివాస్, ఆవుల తిరుపతి, మంద రాజేష్, కనపర్తి లింగారావు, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.