నవతెలంగాణ -పెద్దవూర
మండలంలోని నాయిన వాని కుంటలో సోమవారం హోలీ పండగ వేడుకలను మంగళవారం ఘనంగా జరుపుకున్నారు.కాంగ్రెస్ యూత్ జిల్లా నాయకులు వాసికర్ల వినయ్ రెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు వాసికర్ల విక్రమ్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఉదయం నుంచే తమ తమ గ్రామం లో చిన్నా పెద్ద భేదం లేకుండా చిన్నారులు, పెద్దలు, మహిళలు, యువతీయువకులు రంగులను ఒకరిపై ఒకరు చల్లుకుని హోలీ పండుగలో పాల్గొన్నారు. చిన్నారులు ఉదయం నుండే చిన్న చిన్న కర్రలతో జాజిరి పాటలు పాడుతూ జాజిరి ఆట ఆడారు.
గ్రామం లో వీధులు రంగులమయం అయ్యాయి. నాయకులు ఒకరికి ఒకరు రంగులు చల్లి శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ కార్యక్రమంలో రమేశ్, నాగరాజు, శివ, జాన్ రెడ్డి, విజయందర్ రెడ్డి, అనిల్, బాలకృష్ణ, రమేశ్, హరికృష్ణ, సైదులు, నాగయ్య, ప్రభాకర్ రెడ్డి, చీమట శివ, రమేశ్, తదితరులు పాల్గొన్నారు.