ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న జయంతి వేడుకలు

నవతెలంగాణ-భిక్కనూర్
మండల కేంద్రంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాపన్న చిత్రపటానికి పూలమాలలు వేసి దేశానికి ఆయన చేసిన సేవలను గురించి గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం సభ్యులు సిద్ధగౌడ్, మురళి గౌడ్, స్వామి గౌడ్, ఎల్లగౌడ్, రామగౌడ్, తదితరులు పాల్గొన్నారు.