
లంబాడాల ఆరాధ్యదైవం సీత్లా భవాని పండుగ మహిళలు మంగళవారం బోనాలు సమర్పించి సీత్లా పండుగను ఘనంగా జరుపుకున్నారు. పెద్దవూర మండలం కుంకుడు చెట్టు తండా లో సీత్ భవాని మాత అమ్మ వారికి కాంగ్రెస్ మండల సీనియర్ నాయకులు గ్రామానికి చెందిన రమావత్ చందు, ప్రేమ్ చందు ఆధ్వర్యంలో గిరిజన మహిళలు డప్పు వాయిద్యాలతో నృత్యాలు చేస్తూ బోనాలతో వచ్చి అమ్మవారికి సమర్పించారు. సీత్ల పండుగ జరుపు కోవడం వల్ల వర్షాలు బాగా కురవాలని పంటలు బాగా పండుతాయని,ప్రజలు, పశువులు ఆరోగ్యంగా ఉంటారని, తండాలో యేటా ఈ పండుగను పురస్కరించుకొని బోనాలతో అమ్మవారికి అర్పించడం ఆనవాయితగా వస్తుంది. ఈ కార్య క్రమంలో మహిళలు తదితరులు పాల్గొన్నారు.