ఘనంగా సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు

నవతెలంగాణ-భిక్కనూర్
భిక్కనూరు పట్టణంలో సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలను కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టిపిసిసి రాష్ట్ర కార్యదర్శి ఇంద్రకరణ్ రెడ్డి, డిసిసి ఉపాధ్యక్షులు చంద్రకాంత్ రెడ్డి, ఎంపీపీ గాల్ రెడ్డి సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి పూలమాలలు వేసి జయంతి వేడుకలు నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ చంద్రబోస్ అడుగుజాడల్లో నడవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సుదర్శన్, పట్టణ అధ్యక్షులు దయాకర్ రెడ్డి, సీనియర్ నాయకులు లింబాద్రి, సిద్ద గౌడ్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.