నవ తెలంగాణ-గోవిందరావుపేట: అంతర్జాతీయ బాలల దినోత్సవం వేడుకలను నవంబర్ 14 చాచా నెహ్రూ జన్మదినం సందర్భంగా పలు పాఠశాలల్లో ఘనంగా జరుపుకున్నారు. మంగళవారం మండలంలోని పస్రా గ్రామంలోని సెయింట్ మేరీ పాఠశాలలో బాలల దినోత్సవ వేడుకలను పాఠశాల కరస్పాండెంట్ స్టీఫెన రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ స్టీఫెన్ రెడ్డి మాట్లాడుతూ నేటి పిల్లలే రేపటి పౌరులని, పిల్లలను మంచి పౌరులుగా తీర్చిదిద్ది దేశ ప్రగతిలో పాలుపంచుకునేలా తయారు చేస్తామని అన్నారు. అనంతరం విద్యార్థులు సాంస్కృతిక. కార్యక్రమాలతో అలరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.
మండలంలోని ప్రాజెక్టు నగర్ గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ ఆధ్వర్యంలో బాలల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మాజీ ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ జన్మదినం సందర్భంగా నెహ్రూ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించి కొనియాడారు. అనంతరం బాలల దినోత్సవం విశిష్టతను ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ పిల్లలకు వివరించారు.