సేయింట్ థామస్ స్కూల్ లో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు

 – హాజరైన పాండు రంగారెడ్డి
నవతెలంగాణ : మండలంలోని గర్నెకుంట గ్రామం లో సేయింట్ థామస్ ఉన్నత పాఠశాల లో మంగళవారం బాలల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు బుసిరెడ్డి పౌండేషన్ చైర్మన్ పాండురంగారెడ్డి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. బాలల దినోత్సవం సందర్బంగా పాఠశాల లో స్ధానిక స్వపరిపాలన దినోత్సవం జరిపారు. వివిధ రంగాల్లో ప్రస్తుతం ఏ విధంగా ఎవరెవరు రాణిస్తున్నారో కళ్ళకు కట్టినట్టు పిల్లలు చూపించారు. ఉత్తమ ప్రతిభ కనపర్చిన వారికీ పాండు రంగారెడ్డి షీల్డులు బహుకరించారు. అనంత రం పాండు రంగారెడ్డిని ఘన సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో తిరుమలగిరి సాగర్ మండలం వైస్ యంపిపి యడవల్లి దిలీప్ రెడ్డి, ఏం ఆర్పియస్ డిస్ట్రిక్ట్ అధ్యక్షుడు ఆడెపు నాగార్జున, ఇస్రం లింగస్వామి, అనుముల కోటేష్, గజ్జల శివానంద రెడ్డి, గజ్జల నాగార్జున రెడ్డి, గాలి నరేందర్ రెడ్డి, మధు, యాదయ్య, విద్యార్థులు, టీచర్స్, స్కూల్ యాజమాన్యం మరియు తదితరులు పాల్గొన్నారు.