– పిల్లలు శాస్త్రీయ విజ్ఞానం వైపు ప్రయాణించాలి
నవతెలంగాణ – మియాపూర్
రెండు రోజులపాటు జరిగిన బాలల దినోత్సవ జాతర ముగింపు కార్యక్రమం సుందరయ్య విజ్ఞాన కేంద్రం గచ్చిబౌలి లో ఘనంగా శనివారం ముగిశాయి. ఈ కార్యక్రమానికి రఘునందన్ శానిటరీ సొసైటీ, సుందరయ్య విజ్ఞాన కేంద్రం కార్యదర్శి ప్రభాకర్, గండిపేట్ ఎంఈఓ విజయ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ నేడు సమాజంలో మూఢనమ్మకాలు పెరిగిపోతున్న సమయంలో సుందరయ్య విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో విద్యార్థులను సైన్స్ వైపు నడిపించేందుకు ఏర్పాటు చేసిన అనేక కార్యక్రమాలు అభినందనీయమని వారు అన్నారు. ముఖ్యంగా పిల్లల్లో శాస్త్రీయ విజ్ఞానాన్ని పెంచుకోవాలని కంప్యూటర్ ఇంటర్నెట్ తో సమానంగా ఆ బుక్స్ ను చదివినప్పుడే విజ్ఞానం వస్తుందని వారు గుర్తు చేశారు. పిల్లలను చదువుతోపాటు ఆటపాటలు శారీరక మానసికంగా దృఢంగా ఉన్నప్పుడే సమాజంలో కష్ట నష్టాలు ఎదుర్కొని దృఢమైన వ్యక్తులుగా తయారవుతారని వారు తెలిపారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహించిన అనేక కాంపిటీటివ్ పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు ఆ బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలోముఖ్య అతిధులుగా కె. రాంచంద్రయ్య, (ఎన్ ఐటీ ప్రొఫెసర్ రిటైడ్) విశిష్ట అతిధులు వెంకటయ్య ఎం. ఈ ఓ. శేరిలింగంపల్లి, సుందరయ్య విజ్ఞాన కేంద్రం ట్రస్ట్ సభ్యులు ఆర్. సాంబశివరావు గారు బలోత్సవ కన్వీనర్ సి. విజయ్ కుమార్ సుందరయ్య విజ్ఞాన కేంద్రం, బాధ్యులు రవీందర్, అనిల్ సిబ్బంది అన్ని స్కూల్ విద్యార్థులు పాల్గొన్నారు.