
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ తెలంగాణ యూనివర్సిటీ శాఖ ఆధ్వర్యంలో యువజన వారోత్సవాల ముగింపు సభ కంప్యూటర్ సైన్స్ బిల్డింగ్ లో గురువారం నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రొఫెసర్ వాసం చంద్రశేఖర్, పూర్వ రాష్ట్ర అధ్యక్షులు రేంజర్ల నరేష్, స్టేట్ సెక్రటరీ ఝాన్సీ పాల్గొని మాట్లాడుతూ ఇద్దరు యోధుల స్వామి వివేకానంద, నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతుల సందర్భంగా యువజన వారోత్సవాలు జనవరి మొదటి వారంలో నిర్వహించడం జరిగిందన్నారు క్రికెట్, కబడ్డీ, వాలీబాల్, క్విజ్, ఖోఖో వ్యాసరచన పోటీలలో ఆడి గెలుపొందిన విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు .విద్యార్థి దశ నుండే గెలుపోటములు అలవాటు చేస్తూ గెలిచిన వారు మరింత ముందు వెళ్ళడానికి ఓడిపోయిన వాళ్ళు గెలవడం కోసం ప్రయత్నం చేయాలని యువతలో ఉన్న నైపుణ్యాన్ని ప్రదర్శించడానికి ప్రతి ఏటా అవకాశం ఉంటుందన్నారు.నేతాజీ సుభాష్ చంద్రబోస్, స్వామి వివేకానంద లను నిదర్శంగా తీసుకొని దేశం కోసం దేశభక్తి కోసం అవసరమైతే యుద్ధమస్తే పనిచేయడానికి సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జాతీయ కార్యవర్గ సభ్యుడు శివ, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మనోజ్ కుమార్, ఇందూర్ నగర అధ్యక్షులు గొడుగు వెంకట కృష్ణ,నర్సయ్య, నాగరాజు, సాయికుమార్, సాయి కిష్ణ, అనిల్, హరిక్రిష్ణ, ప్రమోద్, సచిన్, సురేష్, నరేష్, మహేష్, సతీష్ తదితరులు పాల్గొన్నారు.